Tuesday, 27 May 2014

జగన్ కు మోడీ నమస్కారం!!!


జగన్ :-నమస్కారం sir ...న పేరు ఓదార్పు జగన్ ,మీకు తెలిసే వుంటుంది ..

మోడీ :-ఆహా తెలుసు నాయన ,కారణం వున్నా లేకపోయినా రాష్ట్రములో వున్నా అన్ని families ని ఓదర్చవు అంట కదా ...(విత్ చిరాకు ) ఎయిడ్స్ తో పోయినోళ్ళ families ని కూడా ఓదర్చవు అంట కదా (విత్ చిరాకు ).

జగన్ :- ఏదో మీ అబిమానం (విత్ కన్నింగ్ పేస్ ).

మోడీ :-నీకు అల అర్ధమయిందా నాయన ....సరే గాని మహాను బావులు ఇలా వచ్చారు ఎందుకు నన్ను కూడా ఓదర్చదానిక ?(విత్ ఫియర్ )....వధులే నాయన ఇప్పుడు నేను బాగానే వున్నాను .........

జగన్ ;-ఇ ఓదర్పులు ఇంక పని అవ్వవు అని తెలిసిపోయింది సర్ ,అందుకే మా చిట్టి చెల్లాయి షర్మిల బాణాన్ని జనాల్లో వదిలాను ,మా చెల్లి పీచు గొంతుకుకు బయపడి జనాలు పరుగులు పెట్టారు ..ఇలా కాదని ప్రతి న్యూస్ websites కి and న్యూస్ చానల్స్ కి నన్నే పొగిడి , నేనే గెలుస్తానని చెప్పమని చెప్పించా కానీ పలితం లేకపోయినిది .....నేను ఓడిపోయాను ... కనీసం నేను డబ్బులు పంచిన వాళ్ళు కూడా నన్ను మోసం చేసి వోట్లు పక్క పార్టీ కి వేసారు .........

మోడీ :-ఇప్పుడు నేను ఏం చేయాలి నిన్ను ఓదర్చల ........?

జగన్ :-వద్దు సర్ ఆల్రెడీ నాకు నేనే ఓదర్చుకున్న .....

ఇంతకి నేను వచ్చిన పని ఏంటంటే మా నాన్న పదివిలో వుండగా నేను రాష్టాన్ని పీల్చి పిప్పి చేసి వదిలేసాను ,జనాల సొమ్ము అడ్డంగా బూక్కెసాను ,న ఆస్తులు ఇప్పుడు ఎంత వున్నాయో నాకే తెలియదు ...మొన్నే CBI వాళ్ళ పుణ్యమా అని లక్ష కోట్లు అని తెలిసింది .............gods must be so crazy(విత్ smiling పేస్ )

కాబట్టి దయ చేసి ఎలాగైనా నన్ను ఆ కేసుల నుండి బయట పడేయండి ....న ఆస్తులు జప్తు చేయకుండా చుడండి .....కావాలంటే మీకు వెయ్యి కోట్లు యిస్తా ...........

మోడీ :- వద్దు నాయన చట్టం తన పని తను చేసుకు పోతుంది .................అయిన మొన్నటి దాక నన్ను మొడియ......గిదియ.....
బోడియ.... అని పాచి భుత్హులు తిట్టి ఇప్పుడు న కాళ్ళు పట్టుకున్తవే నాయన...అయిన మే ఫ్యామిలీ ఆక్టింగ్ ఎక్కడ నేర్చుకుంటారు నాయన ఎంత బాగా ఆక్ట్ చేస్తున్నారు .........ఇ బయం జనాల సొమ్ము తినక ముందు వుండాలి............

జగన్:-మిరే ఇలా అంటే ఎలా సర్ ...కావాలంటే మా MLA ల ఫుల్ support మీకే వుంటది సర్ ........

మోడీ:-వద్దు బాబు మేము ఎవరి సపోర్ట్ లేకుండానే 280+ సీట్లు సాదించం ...నాకు ని బోడి సపోర్ట్ ఏమి వద్దు గాని జైలు కి వెళ్ళడానికి రెడీ గ వుండు ......అక్కడ కైదీలు నువ్వు ...ఆయన వస్తాడు ..అని చూస్తున్నారు..........


Saturday, 26 April 2014

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....
ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి....
విశ్రమించ వద్దు ఏ క్షణం---
విస్మరించ వద్దు నిర్ణయం...
అప్పుడే నీ జయం నిశ్చయం రా....
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...
నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా....
పశ్చిమాన పొంచి ఉండి రవి ని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా...
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...
నిశా విలాసమెంతసేపురా.... 
ఉషొదయాన్ని ఎవ్వడాపురా ...
రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా... 
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగుననీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..
బ్రతుకు అంటె నిత్య ఘర్షణ ... 
దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...
దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...
ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..
ఆశయమ్ము సారధవును రా..
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ 

                                                                                              దేవకీ నం కృష్ణ కిరీటి

Tuesday, 22 April 2014

తేనె కన్నా తీయన మన తెలుగు


తేనె కన్నా తీయనయన తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లబించిన సంగతి మనకు తెల్సిందే . తెలుగు భాష వేల సవత్సరాల క్రితమే ఉందన్న ఆధారాలున్నప్పటకి ఆది కవి నన్నయ్య మహాభారతాన్ని తెలుగు లోకి అనువధించడం తో ఒక్కసారిగా తెలుగు మాధుర్యం అందరికి తెలిసిందే . దేశభాషలందు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు వందల సవత్సరాల క్రితమే కీర్తించినా ''ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' అంటూ పండితులు పొగిడిన తెలుగువాడి మానసిక సంతృప్తి కె పనికి వచ్చింది . నేను తెలుగు వాడిని అంటూ గుండెలు నిండా గాలి పీల్చికుని అంతర్జాతీయ సాహిత్య ప్రపంచం ముందు నిలబడాలి . 13 వ శతాబ్దం లో తిక్కన్న , 14 వ శతాబ్దం లో ఎర్రన్న మహాభారతాన్ని అనువదించడాన్ని పూర్తి చేసారు . ఈ ఇతిహాసం అప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్ర లో నిలిచిపోయింది. 15 వ శతాబ్దం కవులు శ్రీనాధుడు , పోతన్న , జక్కన్న తమ రచలనలతో తెలుగు భాష కు ప్రాణం పోశారు. మరి ఆనాటి నుంచే మన భాష కు అంత ప్రాధాన్యం ఇస్తే నేడు మనం తెలుగుకు ఇచ్చే ప్రాధాన్యం మేంటి?

ఓటర్ లారా................కధ వినండి...


ఓటర్ లారా ఒక కద చెపుతాను వినండి ఒక ఉరిలో పెళ్లిలుపెరయ్య ఉన్నాడట చాల ఉర్లు తిరుగుతూ ఉంటాడట ఓకే రోజు ఒక నిరుపేద ఇంటికీ వేలాడట అ ఇంట్లో ఒక పెళ్లి కావలసిన అమ్మాయ్ ఉందట అప్పుడు పెళ్లిలుపెరయ్య అమయ్య నీ కూతురికి పెళ్లి చేయవ అని అడిగాడట అప్పుడు తండ్రి మంచి సంబంధం దొరికితే చేసేదం అని అన్నాడట అరె నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది చస్తారా అన్నడట చూపించండి అని చూసారట ఒకే అబ్బాయి బాగా ఉన్నాడు ఓకే చేసేద్దాం అన్నాడు పిల్ల తండ్రి ఈ లోగ ఇంటిలోనుండి పిల్ల తల్లి బయటకు వచ్చి ఎంటీ అని అడిగింది ఈ జరిగిన కథ అంత చెప్పాడు ఓకే అంతా బాగుంది ఇంతకు అబ్బాయి అమీ చేస్తాడు అని అడిగింది అమీ లేదు మొన్న జైలుకి పోయి బైలు మీద వచాడు వైడలు కు జైలుకు వెళ్లి వస్తు ఉంటాడు అనగానే వెంటనే తల్లి దండ్రులు లేవయ్యా లే లే లే అన్నారట ఎ అన్నాడట మేముపెదవల్లమే కానీ పిల్లని కాస్త మంచిగా చూసి ఇస్తాం అన్నారట బాగా గమనించండి ఒక్క ఆడపడచు ని ఇచేటందుకు యింతగా ఆలోచిస్తే 60000000 జనాబా గల రాస్త్య్రాన్ని ఎలా అప్పజప్పాలి చూసి అలోచించి వోట్ వెయ్యాలి

Tuesday, 15 April 2014

టీడీపీ డోర్ పోస్టర్లపై పవన్ ఫొటో..!




*జూనియర్ ఎన్టీఆర్ ఫొటో లేదని దహనం చేసిన అభిమానులు
హుజూర్‌నగర్: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్ పేరిట ముద్రించిన టీడీపీ డోర్ పోస్టర్లలో సినీనటుడు పవన్ కల్యాణ్ ఫొటో ఉంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది....
దీంతో సోమవారం ఆగ్రహించిన వారు ఆ పోస్టర్లను దహనం చేశారు. అయితే ఆ పోస్టర్లలో చంద్రబాబు ఫొటో కూడా ఉందని, మీరెలా దహనం చేస్తారని టీడీపీ కార్యకర్తలు వీరితో ముష్టియుద్ధానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది

Wednesday, 2 April 2014

చిలక జోష్యుల పొట్టగొడుతున్న మీడియా


చిలక జోష్యుల పొట్టగొడుతున్న మీడియా ఒకప్పుడు చిలక జోస్యం వృత్తిగా వుండేది కాని ఈ మధ్య అరుదైంది కాని ఆ కరువును చిల్లర కోసం కక్కుర్తి పడే  మీడియా తీరుస్తోంది

సర్వేల పేరుతో రాజకీయ పార్టీల సొమ్ముల సమర్పణకు అనుగుణంగా ఓటర్ల ఉమ్ము లో కొట్టుకు పోయే వాళ్లకు ‘కొమ్ము’ తో బాకా ఊదుతున్నారు

ఊడిగం చేస్తున్న పనికి ఉత్తమ వృత్తిలో వున్నట్టు తమకు తాము పాత్రికేయులు విశ్లేషకులు అని మొహానికి రంగు వేసుకొని వచ్చి మరీ కంపరం కలిగిస్తున్నారు

Tuesday, 11 March 2014

'హిందుత్వం'

అక్బరుద్దీన్‌ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్‌'. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం?
మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడా తన తల్లికి బట్టలు తొడిగిన ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. 'మతం' గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని వెనకేసుకొచ్చినా 'హిందుత్వ'మని కత్తులు దూసే సెక్యులర్‌ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చేసుకుని గౌరవించుకున్నాం. మరే ముస్లిం దేశంలోనూ ఏ హిందువూ ఏ విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు లేవు. నెదర్లాండులో తమ దేవుడిని వెక్కిరించే కార్టూన్లు వేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆస్తులూ, ఇళ్లూ తగలెట్టారు. తమ దేవుడిని దూషించిన ముస్లిం రచయితనే చంపాలని మరో దేశపు మతగురువు శాసిస్తే -యిప్పటికీ సాల్మన్‌ రష్దీ రహస్యపు బతుకు బతుకుతున్నాడు. మనం చిత్రగుప్తుడిని, యముడినీ (రెండు 'యముడికి మొగుడు' సినీమాల్ని చూసి సంతోషించాం) శ్రీకృష్ణుడినీ, నారదుడినీ ఆటపట్టిస్తే ప్రేక్షకులు వందరోజులు చూసి ధన్యులవుతారు. బ్రాహ్మణ్యాన్ని గర్హించి -వాళ్ల చేత పేడ తినిపిస్తే -బ్రాహ్మణతరులు కిల కిల నవ్వుకుంటారు. ముస్లింలలో అలాంటి పరాచికాలు ఎప్పుడయినా ఎవరయినా చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసి బతికి బట్టకట్టగలరా?
ఈ దేశంలో ముస్లిం సోదరులంతా ఒకటి. ఎక్కడ ఉన్నా ఒకటిగా ఓటు వేస్తారు. అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు. మతం పట్ల గౌరవం, మరొక పక్క భయం - వారిని సంఘటిత పరుస్తుంది.
మనదేశంలో మనం మహారాష్ట్రులం, తమిళులం, బెంగాళీలం, వెనుకబడిన వారం, ముందుబడినవారం, కులాలవారం, రెడ్లం, కమ్మవారం, కాపులం, బ్రాహ్మణులం, శ్రీవైష్ణవులం, శైవులం, మాలలం, మాదిగలం -మనం సామూహిక ప్రతిపత్తిని ఏనాడూ ప్రకటించుకోము. ఎవరూ ఎవరిమాటా వినరు. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరయినా ఎప్పుడయినా ముస్లింలకు ప్రాతిపదిక మతం. మనకి? వ్యక్తిగత ప్రయోజనం, స్వలాభం, డబ్బు, పదవి, ఎదుటివాడి పతనం -మరేదో, మరేదో.
హిందూదేశంలో ముస్లింల 'హజ్‌' యాత్రకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రపంచంలోని 52 ముస్లిం దేశాలలో ఏ దేశంలోనూ ఈ ఉపకారం లేదు. శుభం. మరి భారతదేశంలో కాశీ, గయ, కేదార్‌, బదరీ, వైష్ణోదేవి యాత్రలకు మన ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యదేం? అడిగే నాధుడేడీ? వాళ్ల స్వార్దాలకే వ్యవధి చాలకపోయె. మన చిన్న పొట్టకు శ్రీరామరక్ష. మన కులానికి మేలు కలిగితే చాలు. మొన్న విశాఖపట్నంలో ఓ స్వామీజీని బహిరంగంగా కొట్టారు. కారణమేదయినా ఈ పనిని ఏదీ? ఒక 'ఇమామ్‌'కి దమ్ముంటే చేయమనండి. మనది భారతదేశం. పరాయి పెద్దని అవమానించమనడం ఉద్దేశం కాదు. మన మర్యాదకి నీడలేదని చెప్పడం ఉద్దేశం.
అక్బరుద్దీన్‌ చేసిన ప్రసంగం ఏ హిందువయినా చేసి బతికి బట్టకట్టగలడా? ముస్లింలు మాట దేవుడెరుగు. ఔదార్యం కట్టలు తెంచుకునే మన సెక్యులర్‌ వీరులు 'హిందుత్వం' పేరిట గొంతుచించుకోరా? అక్బరుద్దీన్‌ అరాచకాన్ని ఉత్తరప్రదేశ్‌లో మరో ముస్లిం నాయకుడు సమర్థించారు! హిందూ దేశంలో ముస్లింల కిచ్చిన ప్రత్యేక స్థానం మరే ముస్లిం దేశంలోనయినా హిందువుల కిచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ దేశంలో 15 శాతం మైనారిటీ వర్గాన్ని 85 శాతం మెజారిటీ వర్గం నెత్తిన పెట్టుకుంటోంది.
కరుణానిధికి రామాయణం కట్టుకథ. ఆయన మన ముఖ్యమంత్రి. దేవుడిని నమ్మని, నమ్మకం లేదని బల్లగుద్దే ఏ ముస్లిమయినా ఏ ముస్లిం దేశంలో నయినా నాయకుడు కాగలడా?
ఈ విచిత్రాన్ని ఎవరయినా గమనించారా? గాజాలో అరబ్బులు క్షేమంగా లేరు. పాకిస్తాన్‌లో వందలమంది ముస్లింలను వారే చంపుకుంటున్నారు. లిబియాలో, మొరాకోలో, ఆఫ్గనిస్థాన్‌లో, సిరియాలో, లెబనాన్‌లో, ఈజిప్టులో, ఇరాక్‌లో, యెమెన్‌లో ముస్లింలు హింసకు బలి అవుతున్నారు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లండులో, ఫ్రాన్స్‌లో, ఇటలీలో, జర్మనీలో, స్వీడన్‌లో, అమెరికాలో, నార్వేలో వారు క్షేమంగా, హాయిగా ఉన్నారు. అయినా ఆ దేశాల్లో ముస్లింలు పై దేశాల్లో ముస్లింలుగా ఉండాలనుకుంటున్నారు.
మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో ముస్లింలు మైనారిటీలుగా రాయితీలు పొందుతున్నారు. శుభం, మరి ఈ దేశంలోనే జమ్ము కాశ్మీర్‌లో, మిజోరంలో, నాగాలాండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో, మేఘాలయలో మైనారిటీలయిన హిందువులకు ఆ రాయితీలు యివ్వడం లేదేం?
ముస్లిం మత కార్యకలాపాలను, వారి వ్యవహారాలను చూసే వక్ఫ్‌ బోర్డులున్నాయి. వాటి ఆదాయాన్ని ఈ దేశంలో ఎవరయినా ముట్టుకోగలరా? పదిమంది దర్శించే ప్రతి హిందూ దేవాలయ పరిపాలనా, ఆదాయం -రాజకీయ నాయకుల, వారి ప్రతినిధుల చేతుల్లోకి పోయిందేం?
ఎవరయినా మనల్ని తిట్టినప్పుడు -మనం హిందువులం. ఎవరూ తిట్టనప్పుడు -మనల్ని మనమే తిట్టుకునే స్వదేశీయులం. అదీ మన ప్రతాపం.
'మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్‌!' అన్నాడు గిరీశం. అక్బరుద్దీన్‌ వంటి పెద్దలు ''వీళ్లంతా ఉత్త వెధవాయిలోయ్‌!'' అని నవ్వుకుని ఉంటారు. అందుకే రొమ్ము విరుచుకుని -ప్రేక్షకులు మురిసిపోయేలాగ -హిందూ దేశంలో హిందువుల్ని తిట్టి -తీరిగ్గా లండన్‌ వెళ్లి కూర్చున్నారు. ఇక్కడ మన వీరంగం చూసి -అక్కడ పేపర్లలో చదువుకుని నవ్వుకుంటూ ఉండి ఉంటారు.
కులాల పేరిట, వర్గాల పేరిట -కిష్టిగాడు, రాములు వెధవ, సీతి, లచ్చి స్థాయికి మతాన్ని యీడ్చిన గౌరవనీయులైన హిందువులు -మొదట ఇల్లు చక్కబెట్టుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. తమలో ఏ లోపాలున్నా 'మతం'- భేషరతుగా -నయానికో, భయానికో -తమకి గుర్తింపునీ, బలాన్నీ, సామూహిక ప్రతిపత్తినీ యివ్వగల శక్తి అని ముస్లింలు నమ్ముతున్నారు. మనం ఏనాడయినా -ఎవరో మనని దుయ్యబట్టిన యిలాంటి అరుదయిన సందర్భాల్లో ప్రథమ కోపాన్ని చూపడం తప్ప -యిలాంటి సంఘటిత శక్తిని ప్రదర్శించామా?
అక్బరుద్దీన్‌ తప్పు చేశాడా? ఇప్పుడు క్రైస్తవ మతాన్ని సహాయం తెచ్చుకుంటాను. మీ మతాన్ని, మీ విలువల్ని, మీ విశ్వాసాల్ని, మీ ఆచారాల్ని గౌరవించే మొనగాడెవరయినా ఉంటే మొదటి రాయి వెయ్యండి.
నా ఉద్దేశంలో అక్బరుద్దీన్‌ ప్రసంగం మేలుకొలుపు. పేడ తినే బ్రాహ్మణ్యం, యముడిని వెక్కిరించే సినిమాలూ, స్వజనాన్ని గౌరవించుకోలేని స్వార్థం, వేలంటీన్‌ వేలం వెర్రికి విర్రవీగే సామూహిక పైత్యం, దేవుడు, దేవాలయాలు 'హిందుత్వం' అని రాజకీయ ప్రయోజనాలకు గొంతు చించుకునే అవకాశవాద పార్టీలూ మతానికి విలువని పెంచవు. అక్బరుద్దీన్‌ వంటి వారి నోటికి బలి అవుతాయి. అంతకంటే భయంకరమైన విషయం ప్రేక్షకుల ప్రశంస అనే హెచ్చరిక.


---కిరీటి 

మహేష్ బాబు – కొరటాల శివ కొత్త సినిమా


                                                                       

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కలిసి కొత్త సినిమాలో పని చేయనున్నారు. ఈ సినిమాని యూటీవీ నిర్మించనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ రెండవ వారం నుండి మొదలవుతుంది. ఈ సినిమా లాంచ్ ని భారీ గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం కొరటాల శివ, మరి కొంతమంది పని చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఆగడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత కొత్త సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కొరటాల శివ ఈ సినిమా కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ రాసున్నారని తెలిసింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాల కోసం కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Monday, 10 March 2014

ఆగ‌డు మూవీలో ఆరుగురు బిగ్ స్టార్స్‌

ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న అప్‌క‌మింగ్ మూవీ ఆగ‌డులో ఆరుగురు బిగ్ స్టార్స్ న‌టిస్తున్నారు. మ‌హేష్‌బాబుతో పాటు వీరు సైతం ఆగ‌డు మూవీకు మ‌రింత బ‌లాన్ని, స‌క్సెస్‌ను చేకూరుస్తార‌ని డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల న‌మ్మ‌కాల‌ను పెట్టుకున్నాడ‌ట‌. ఆగడు మూవీపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో తెగ ఆస‌క్తి నెల‌కొంది. ఆగ‌డు మూవీలో మ‌హేష్‌బాబుతో పాటు న‌టిస్తున్న కో స్టార్స్ కూడ మూవీ  స‌క్సెస్‌కు మ‌రింత ఉప‌యోగ‌ప‌డ‌తార‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ మూవీలో స్టార్ యాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, సాయికుమార్‌, త‌మిళ్ యాక్ట‌ర్ నెపోలియ‌న్‌, క్రేజీ యాక్ట‌ర్ న‌దియా ఇందులో నటిస్తున్నారు. మ‌హేష్‌బాబు పాత్ర‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ క్యారెక్ట‌ర్స్ ఆగ‌డు మూవీ స‌క్సెస్‌కు తోడ్ప‌డ‌తార‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. ప్ర‌స్తుతం ఆగ‌డు మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్స్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ మూవీలో మ‌హేష్‌బాబుకు జోడిగా త‌మ‌న్న మొద‌టిసారిగా హీరోయిన్‌గా చేస్తుంది. ఆగ‌డు మూవీ షూటింగ్ అనంత‌రం ప్రిన్స్ మ‌హేష్‌బాబు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. మొత్తానికి ఈసారి దూకుడు మూవీలోని క్యారెక్ట‌ర్స్‌ను ప‌బ్లిసిటి కోసం శ్రీనువైట్ల ఉప‌యోగించుకుంటున్నాడు

Wednesday, 5 March 2014

రాష్ట్ర విభజన తర్వాత దేశంలో , రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ?

 --- నా అంచనా ---

రాష్ట్రవిభజన అంశం మిగిలిన దేశంపై ఏ మాత్రం ప్రభావం చూపదు . మోడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ
అధికారంలోకి రావడం తధ్యం .
ఇక మనరాష్ట్రంలో , KCR కి కావాల్సినంత డబ్బు ఇచ్చి TRS ను కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటుంది సోనియా . కృతజ్ఞత
పేరుతొ , TRS ను సోనియా కు KCR అమ్ముకుంటాడు . తెలంగాణా లో ఇద్దరికీ ప్రత్యర్ధి BJP . దానిపై కాంగ్రెస్ విమర్సనాస్త్రాలు ఎలా ఉంటాయంటే , “ BJP కి ప్రజలు అధికారం అప్పగించినా , చంద్రబాబు వద్దన్నాడని , తెలంగాణా ని ఇవ్వలేదు . ఒక్క చంద్రబాబు వ్యతిరేకించినందువల్ల BJP తెలంగాణా ఇచ్చే సాహసం చెయ్యలేకపోయింది . కాని
కాంగ్రెస్ మాత్రం తన స్వంత పార్టీ లోనే ఎంత వ్యతిరేకత ఉన్నా , తన MP లు , MLA లు , మంత్రులు , చివరకు తన
ముఖ్యమంత్రి సైతం వ్యతిరేకించినా , సీమాంద్రలో తన పార్టీకి ఎంత నష్టం జరుగుతున్నా , భయపడక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణా ఇచ్చింది “ ఈ ప్రచారం తో తెలంగాణా ఓట్లు కొల్లగొట్టుకుంటుంది . పాపం BJP కి చారిత్రక తప్పిదం
మిగులుతుంది . చంద్రబాబు నాయుడుకి ఒక కన్ను శాశ్వతంగా గుడ్డిదవుతుంది .
ఇక సీమాంద్రలో , కిరణ్ , సమైక్యవాదం పేరుతొ కొత్త పార్టీ పెడతాడు . విభజనను అన్యాయంగా చూబిస్తూ , చంద్రబాబు ఇచ్చిన లేఖ , జగన్ చెప్పిన ఆర్టికల్ ౩ ని అస్త్రాలుగా చేసుకుని , BJP , TDP పొత్తును విమర్శిస్తూ అక్కడ ఓట్లు దండుకుంటాడు . ఇంకా పేద ప్రజల మనసులలో మిగిలిన రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం , చర్చిల సహకారంతో ఏమైనా ఓట్లు మిగిలి పోయి ఉంటే అవి జగన్ బాబు పట్టుకుపోతాడు . అక్కడ చంద్రబాబు 2 వ కన్ను పోతుంది . ఎన్నికలు అయ్యాక , BJP అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కి సీమాంధ్ర కు జరిగిన అన్యాయం , వాళ్ళ సమస్యలు గుర్తుకు వస్తాయి . ఆసుపత్రుల గురించి ,IIT ల గురించి ప్యాకేజి లా గురించి , సీమాంధ్రుల తరపున పోరాడుతుంది . BJP కి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కల్పిస్తుంది . ఆ CREDIT తన ఖాతా లో వేసుకుంటుంది . విభజన వాదం కంటే , మతతత్వ వాదం దేశానికి మరీ ప్రమాదం . కాబట్టి మన రాష్ట్రాన్ని విభజించి మనకు అన్యాయం చేసినా , మత తత్వ పార్టీలను నిరోధించే ప్రయత్నంలో భాగంగా , కాంగ్రెస్ కు బయట నుంచి మద్దతు పలుకుతున్నామంటారు కిరణ్ , జగన్ లు . సీమాంధ్రుల తరపున కాంగ్రెస్ పోరాటాలు కూడా కొంత కలిసొస్తాయి .కొంత కాలం గడిచాక , ప్రజలు మరచిపోయారని భావించాక , తమ పార్టీ లను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తారు . ఇక్కడా BJP కి శూన్యం .
ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ లో TDP , BJP లను శాశ్వతంగా అడ్డు తొలగించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ .
ఇక్కడ మాత్రం BJP తనకు అందివచ్చిన చక్కటి అవకాశాన్ని జారవిడుచుకుంది . విభజన ప్రక్రియ సక్రమంగా లేదని , రాష్ట్రానికి బదులు , ప్రజలను విడదీస్తున్నారని , అందువలన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని తప్పించుకుని , తను అధికారం లోకి వచ్చాక , తన శైలి లో సక్రమంగా విభజించి ఉంటే , ఇరు ప్రాంత ప్రజల ఆదరణ పొంది ఉండేది . ఇది BJP కి చారిత్రక తప్పిదంగా మిగిలిపోతోంది .
మనదేశం నుండి కాంగ్రెస్ ని తరిమెయ్యాలని మిగిలిన ప్రజలు ఎంతగా ప్రయత్నించినా , ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సహకారంతో , ఎలాగోలా బతికిపోతోంది ! !

ప్రపంచమంతా ఉచితంగా ఇంటర్ నెట్!!


వాషింగ్టన్: ఏదో పనిమీద ఓ పల్లెటూరుకు వెళ్లారు.. ఎక్కడో గిరిజన ప్రాంతంలోనో, అడవిలోనో, సముద్రంలో ప్రయాణిస్తూనో ఉన్నారు.. అత్యవసరంగా ఈమెయిల్ పంపించాల్సి ఉన్న సమయంలో జస్ట్ మీ ల్యాప్‌టాప్‌నో, స్మార్ట్‌ఫోన్‌నో తీసి... వైఫై ఆన్ చేసుకుంటాం.ఇంటర్‌నెట్ వచ్చేస్తుంది. దీనికి కొంత సొమ్ము ఛార్జ్ చెల్లిస్తాం.
అదే ఉచితంగా..!? ఇలా జరిగితే బాగుంటుంది కదూ.. అమెరికాకు చెందిన ‘మీడియా డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎండీఐఎఫ్)’ స్వచ్ఛంద సంస్థ ఆలోచన కార్యరూపం దాల్చితే ఇదంతా వాస్తవం కానుంది. అంతరిక్షంలోకి కొన్ని వందల చిన్న కత్రిమ ఉపగ్రహాలను పంపి, వాటిని భూమిపై ఏర్పాటు చేసే గ్రౌండ్ స్టేషన్లకు అనుసంధానించే ‘ఔటర్‌నెట్’కు ఈ సంస్థ రూపకల్పన చేసింది.
సైబీరియా మంచు ప్రాంతాలు, ఆఫ్రికా అడవులు, సముద్ర ప్రయాణంలో.. ఇలా భూమ్మీద ఎక్కడున్నా... జస్ట్ సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌తో ఇంటర్‌నెట్‌ను అందుకోవచ్చు. ఎండీఐఎఫ్ సంస్థ ఈ ‘ఔటర్‌నెట్’కు ప్రణాళికలు వేయడమే కాదు.. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నిధులనూ సేకరిస్తోంది. వచ్చే ఏడాది కొన్ని చిన్న కత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది కూడా. ఈ ప్రాజెక్టుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యయమవుతాయని అంచనా..

పవన్ కళ్యాణ్ చీపురుపడతారా, ఈల వేస్తారా ?


పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై సోషల్ మీడియాలో ప్రచారం హూరెత్తుతోంది. ఆయన సొంత పార్టీ పెడతారని, ఎంపీగా పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పేరు, లోగో వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సామాజిక మాధ్యమం హూరెత్తింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా ముందుకు రానున్నారు. మార్చి రెండవ వారంలో ప్రెస్ మీట్ పెట్టనున్నట్టు పవన్ వెల్లడించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కు లోక్ సత్తా పార్టీ ఆహ్వానం పలికింది. పవన్ తమ పార్టీలో చేరతామంటే స్వాగతిస్తామని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారికి లోక్ సత్తా బహిరంగ వేదిక అని ఆయన చెప్పారు. సమాజాన్ని సానుకూల మార్పు దిశగా నడిపించాలనుకునే వారిని తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ తన సామర్థ్యాన్ని ఎలాగైనా తమ పార్టీకి వినియోగింవచ్చన్నారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేయొచ్చని సూచించారు.

పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి తమ పార్టీలో స్వాగతిస్తామని కొద్ది రోజుల క్రితం టీడీపీ నాయకులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీలో చేరబోవడం లేదంటూ అప్పట్లో నాగబాబు వివరణయిచ్చారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ(ఆప్)లోనూ చేరతారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రంలో 'ఆప్' పగ్గాలు పవన్ చేపడతారన్న చర్చలు కూడా నడిచాయి. అయితే అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.

గత ఎన్నికల సమయంలో తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా పర్యటించి పీఆర్పీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. తదనంతర కాలంలో పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో చిరు, పవన్ మధ్య దూరం పెరిగింది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో పవన్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయన పార్టీ పెట్టే అవకాశాల్లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ పార్టీ తరపున ఎంపీ పోటీ చేస్తారనే దానిపై ఏమీ చెప్పలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్.. చీపురు(ఆప్ సింబల్) పడతారా, ఈల(లోక్ సత్తా గుర్తు) వేస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.  

మహేష్ బాబుకు యాక్సిడెంట్!!!!!!!!!!!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఆగడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం బళ్లారిలో జరుగుతోంది. అయితే షూటింగ్‌ను అర్థాంతరంగా ముగించుకుని మహేష్‌ హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. కారణం చిత్ర షూటింగ్‌లో భాగంగా మహేష్‌కు చిన్న ప్రమాధం జరిగిందట. కాలుకు ప్యాక్చర్‌ కావడంతో వారం రోజులు రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారట. దాంతో మహేష్‌ హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
‘దూకుడు’ తర్వాత అదే కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆగడు’ చిత్రంను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 14 రీల్స్‌ పతాకంపై అనీల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. ‘అత్తారింటికి దేరేది’ ఫేం నదియా ఈ చిత్రంలో మహేష్‌కు అక్కగా నటిస్తోంది. ‘1’ చిత్రం ఫెయిల్‌ తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.