Friday, 28 February 2014

మెగా హీరోకి సంపూర్ణేష్ బాబు సాయం



సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ. `హృద‌యకాలేయం` సినిమాతో త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా విడుద‌ల కాక‌మునుపే సంచ‌ల‌నాలు న‌మోద‌య్యాయి. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో `హృద‌య‌కాలేయం` టీజ‌ర్స్‌కి లెక్కలేన‌న్ని హిట్స్ ల‌భించాయి. దీంతో సంపూబాబు ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆయ‌న ఓ క్రేజీ తార‌. 
ఎలాంటి తార అంటే... మెగా హీరో సైతం త‌న సినిమా  ప్రమోష‌న్  కోసం సంపూబాబు సాయం కోరేంత‌. అవును... మెగా అల్లుడు అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా `కొత్త జంట` అనే సినిమా తెర‌కెక్కుతోంది. మారుతి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం సంపూర్ణేష్‌బాబుపై కొన్ని యాడ్స్ చిత్రీక‌రించార‌ట‌. ఆయ‌న క్రేజీని వాడుకొని `కొత్తజంట`ని ప్రమోట్ చేయాల‌ని మారుతి నిర్ణయించుకొన్నార‌ట‌. 
మామూలుగా మెగా కుటుంబం నుంచి సినిమా అంటే... ప్రమోష‌న్‌కి ఢోకానే ఉండ‌దు. అవ‌స‌రం అనుకొంటే చిరంజీవి నుంచి... అల్లు అర్జున్ వ‌ర‌కు అంద‌రూ రంగంలోకి దిగి త‌లోచేయి వేస్తుంటారు. వాళ్లు కాద‌ని ఇప్పుడు సంపూర్ణేష్‌బాబు సాయం తీసుకొంటున్నాడు అల్లు శిరీష్‌. మ‌న సంపూది నిజంగా ఎంత క్రేజో క‌దూ? అన్నట్టు మ‌నోడు కూడా `కొత్తజంట‌`లో ఓ కీల‌క పాత్ర కూడా పోషించాడు. 

No comments:

Post a Comment