డబ్బే సర్వస్వం కాదని పవన్ కళ్యాణ్ చాటి చెప్పారని ఇపుడు మెగా ఫ్యాన్స్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది. ఇలాంటి చర్చ ప్రచారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుండటమే. పవన్ కళ్యాణ్‌కు బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యూ టీవీ మోషన్ పిక్చర్స్ 60 కోట్లతో గాలం వేసే ప్రయత్నం చేసిందని ఆ వార్తల సారాంశం.
పవన్ కళ్యాణ్ తమ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేయడానికి రూ. 60 కోట్లు ఆ సంస్థ ఆఫర్ చేసిందని, అయితే పవన్ కళ్యాణ్ ఆ ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన అభిరుచి ప్రకారమే సినిమాలు చేస్తానే తప్ప ఇలా గంపగుత్తగా ఇచ్చేకోట్ల ఆఫర్ల కోసం తాను సినిమాలు చేయనని పవన్ తెగేసి చెప్పినట్లు సమాచారం.

nice
ReplyDelete